బహిరంగ ప్రదేశాలలో నూతన సంవత్సర సంబరాలు చేసుకునేందుకు అనుమతులు లేవు

బహిరంగ ప్రదేశాలలో నూతన సంవత్సర సంబరాలు చేసుకునేందుకు అనుమతులు లేవు
నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు
ఎస్ఐ అశోక్
వెల్దుర్తి డిసెంబర్ 31 యువతరం న్యూస్:
వెల్దుర్తి టౌన్ మరియు అన్నీ గ్రామాల నాయకులు, పత్రిక మిత్రులకు, ఉద్యోగస్థులకు ప్రజలందరికి అందరికి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ తరపున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము అని వెల్దుర్తి ఎస్ఐ అశోక్ సోమవారం తెలిపారు.
అన్నీ ప్రధాన రహదారులు, కూడళ్ళు, హైవే పైన పోలీసు గస్తీ ముమ్మరంగా ఉంటుంది కావున ఎవరే కానీ 31 రాత్రి ఎట్టి పరిస్థుతులలో బయట కేక్స్ కట్ చేయడం, సంబరాలు జరుపుకోవడానికి ఎలాంటి అనుమతులు లేవు అని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు.
మీ సంబరాలు మంచి ఆహ్లాదమైన వాతావరణంలో జరుపుకుంటూ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఎవరి ఇంటిదగ్గర వారు చేసుకోవాలని సూచించడం జరుగుతోంది అన్నారు.
యువకులు బైక్ సైలెన్సర్స్ లేకుండా పెద్ద పెద్ద సౌండ్స్ చేసుకుంటూ అందరికి ఇబ్బంది కలిగేంచేలాగా ప్రవర్తిస్తే వారి బైక్స్ సీజ్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తీవ్రంగా హెచ్చరించారు.
డీజే లకు, క్రాకర్స్ కు మరియు పెద్ద పెద్ద సౌండ్స్ సిస్టం లకు ఎలాంటి అనుమతులు లేవు అని తెలిపారు. ఇది గమనించి అందరు పోలీసులకు సహకరించవలసిందిగా కోరుచుకున్నాము అన్నారు.
శుభాకాంక్షలు చెప్పే నెపంతో ఈవ్ టీసింగ్ చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, న్యూసెన్స్ చేయడం ఇలాంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయి అన్నారు.
రోడ్ల పైన, ప్రధాన జంక్షన్ లలో కేకులు కట్ చేయడం, టపాకాయలు పేల్చడం నిషిద్దo అని పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం నుండి వెల్దుర్తి టౌన్ లో వెహికల్ చెకింగ్ చేస్తూ, సరైన పత్రాలు లేని వాటిని, ట్రిపుల్ డ్రైవింగ్ చేసేవారిని, హెల్మెట్ లేని వాటిని, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని తెలిపారు.
మద్యం దుకాణాదారులు నిర్ణయించిన సమయంలోనే షాప్ లను మూసివేయాలి అని తెలిపారు.