బొకేలు వద్దు-మొక్కలు ముద్దు

బొకేలు వద్దు-మొక్కలు ముద్దు
ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్
పత్తికొండ రూరల్ డిసెంబరు 31 యువతరం న్యూస్:
పత్తికొండ ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర 2025 వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేసేందుకు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన టిడిపి నాయకులు,కార్యకర్తలు, అధికారులు, పూలదండలు , బొకేలు, శాలువాలు తీసుకురావద్దని ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్ తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేవారు విద్యార్థుల కోసం పెన్నులు పుస్తకాలు ,ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు మొక్కలు తీసుకురావాలని తెలియజేశారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికోసం ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు పెన్నులు పుస్తకాలు అలాగే పర్యవరన పరిరక్షణ కొరకు మొక్కలు తీసుకొని వచ్చి తనకు శుభాకాంక్షలు తెలియజేయాలని ఇది ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు.