మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిట్ చాట్

మీడియాతో సీఎం చంద్రబాబు చిట్‍చాట్
అమరావతి ప్రతినిధి జనవరి 1 యువతరం న్యూస్:
నేతలు లేదా అధికారులు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది
నేను జైలు నుంచి విడుదలయ్యాక కొంతమందికి కక్ష తీర్చుకుంటానని అన్నాను
నిజమే.. నేను రాజకీయ కక్ష తీర్చుకోను
ఎందుకంటే తప్పు చేసిన వారిని వదిలిపెట్టను
1995 సీఎంను త్వరలో మీరే చూస్తారు
ఇది ప్రారంభమై.. సోషల్ మీడియాకు మీరు చూశారు కదా
మిగతా కేసులు కూడా అలానే డీల్ చేస్తా
కేడర్ ఉద్దేశం ఒకలాగా ఉంది.. నా లక్ష్యం వేరుగా ఉంది
ఎందుకంటే నేను అందరి అభిప్రాయాలు తీసుకోవాలి
అవతలి వాళ్లు చేసినట్టు నేను చేయను
చట్ట ప్రకారం చేస్తా.. ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు
ఎమ్మెల్యేలను పిలిచి అందరితో మాట్లాడుతున్నా
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ గెలిచేట్టు ఉండాలి
2004లో నన్ను ఎవరూ ఓడించలేదు
అలాగే హైదరాబాద్‍ను ఎప్పుడూలేని విధంగా అభివృద్ధి చేశా
కానీ ప్రజలకు నేను కమ్యూనికేట్ చేయలేకపోయా
అధికారులను కూడా గత ఐదేళ్లు బురద గుంటులోకి తోసేశారు
కొందరు అధికారులు జగన్ మాటలు విని పనిచేశారు
సమాజానికి హాని కలిగించే ఎవరినీ నేను వదలను
మా ఎమ్మెల్యేలు అందరికీ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశా
ఎమ్మెల్యేలకు తప్పులు చేయవద్దని పదేపదే హెచ్చరిస్తునా
జగన్ లాగా మేం తప్పులు చేస్తే ప్రజలు అన్నీ గమినిస్తుంటారు
నాకు నా ప్రజలే హైకమాండ్
1995లో జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో లేరు
ప్రజల ఆకాంక్షలు పెరిగాయి
అన్నీ రాత్రికి రాత్రే జరిగిపోవాలి అంటే సాధ్యం కాదనేది అందరూ గమనించాలి
మొదటిసారి ఏపీ చీఫ్ సెక్రటరీగా బీసీకి ఇచ్చా
మా పార్టీ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి పదవులను బీసీకి నేను మాత్రమే ఇచ్చా
సోషల్ రీ ఇంజనీరింగ్ నేను చేస్తున్నా
చీఫ్ సెక్రటరీకి సామర్థ్యం, బీసీ రెండూ విజయానంద్‍కు అర్హతలు
వైసీపీలో ఉన్నవారు రాజకీయ అవసరాల కోసమే పార్టీలు మారుతున్నారు
వైసీపీ నేతల చేరికల అంశం ఈ మూడు పార్టీలలో చర్చ జరుగుతోంది
సంకీర్ణం ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయి
అన్ని విషయాలు మాట్లాడుకుంటాం : సీఎం చంద్రబాబు