కపిలేశ్వరంలో పందులు మాయం చేస్తున్న దుండగులు

కపిలేశ్వరంలో వింత చోరి పందులు మాయం చేసిన దుండగులు
(యువతరం జనవరి 26) కొత్తపల్లి విలేఖరి:
కొత్తపల్లి మండలంలో కపిలేశ్వర గ్రామంలో గురువారం అర్ధరాత్రి దుండగులు వింత చోరికి పాల్పడి 49 పందులను ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన పాములనరసింహా సంగమేశ్వరం వెళ్లేదారిలో ఊరి చివర పందుల దొడ్డి ఏర్పాటు చేసి పందుల పెంపకం సాగించేవాడు గురువారం నరసింహా పందులను దొడ్డిలోకి తోలి ఇంటికి వెళ్లాడు. ఉదయాన్నే వచ్చి చూసే సారికి పందుల దొడ్డి తలుపు తెరిచి,పందులు ఎత్తుకెళ్లిన అనవాలు గమనించాడు చుట్టు పక్క ప్రాంతాల్లో గ్రామాల్లో వెతికిన పందుల ఆచూకీ లభ్యం కాలేదు పందులను కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి పగిడ్యాల మండలంలోని ప్రాతకోట వెళ్లేదారి గుండా పందులను ఎత్తుకెళ్లింటారని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు సుమారు రూ.3లక్షల విలువ చేసే పందులను ఎత్తుకెళ్లారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు