కొత్తపల్లి మండలంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

మండలంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
(యువతరం డిసెంబర్ 25) కొత్తపల్లి విలేకరి:
కొత్తపల్లి మండలంలో క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ వేడుకలను,ఆదివారం అర్ధరాత్రి నుండి ఘనంగా నిర్వహించుకున్నారు. మండలంలోని సీఎస్ఐ, ఆర్సీఎం, బేత్లహం, హోసన్నా తదితర చర్చిలలో ఆయా ఫాస్టర్ల ఆధ్వర్యంలో క్రిస్టియన్ సోదరులు ఏసుక్రీస్తు రాకకోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎదురుపాడు గ్రామంలో యువకుల పాస్టర్ జోసెఫ్ ఆధ్వర్యంలో శిలువను ఊరేగించారు. అనంతరం చిన్నారులకు క్రీడా పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు గ్రామ సర్పంచి రహంతుల్లా చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఆయా కార్యక్రమాలలో పాస్టర్ జోసెఫ్ , సంఘ పెద్దలు, వెంకటేశ్వర్లు,శంకర్,నాగరాజు రమేష్,యువకులు బాల యేసు, సురేష్ రాజు,సత్యాలు,పుల్లయ్య, సంతోష్ కుమార్,బాలయ్య, శివానంద తదితరులు పాల్గొన్నారు.