పెద్దవడుగూరు మండలంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

ఘనంగా క్రిస్మస్ వేడుకలు
(యువతరం డిసెంబర్ 25) పెద్దవడుగూరు విలేఖరి:
కరుణామయుడు, శాంతిదూత యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా నిర్వహించే క్రిస్మస్ వేడుకలను సోమవారం పెద్దవడుగూరు మండలం అంతటా క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే స్నానమాచరించిన క్రైస్తవులు కొత్త దుస్తులు ధరించి చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దీంతో చర్చిలన్ని క్రైస్తవులతో కిటకిటలాడాయి. వేకువజామున ఐదు గంటలకు మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు రెండవ ఆరాధన నిర్వహించారు. ఆయా చర్చిల ఫాస్టర్లు దైవ సందేశాన్ని క్రైస్తవ భక్తులకు అందించారు. గీతాలాపణలు, బైబిల్ పారాయణాలతో చర్చిలు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా పెద్దవడుగూరు పెద్దవాగు వద్ద ఉన్న చర్చి పాస్టర్ జాన్ డేవిడ్, పెద్దవడుగూరు చేనేత కాలనీలో స్వతంత్ర కుమార్ ప్రభువు జననం గురించి వివరిస్తూబోధనలు ప్రపంచ మానవాళికి మార్గ దర్శకమని అందరు ఆచరించాలని కోరారు. ప్రభువును స్మరిస్తూ ఇమ్మానియేల్, ఆనంద్, మేరీ ఆరోగ్యమ్మ,రాణి, వెన్నెల,శోభారాణి, మనోజ్, సంజనలు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ప్రత్యేక ప్రార్థనల అనంతరం క్రైస్తవులు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.