చింతూరులో జోరుగా కోడిపందాలు

చింతూరు లో జోరుగా కోడిపందాలు
లక్ష్మీపురం లో ఘటన ప్రతి ఆదివారం ఇదే తంతు
కోడిపందాల వలన చిత్తవుతున్న బతుకులు పట్టించుకోని అధికారులు
సంవత్సరానికి ఒకసారి రైడింగ్ చేయడం వలన రెచ్చిపోతున్న పందెం రాళ్లు
(యువతరం డిసెంబర్ 25) వాజేడు విలేఖరి :
ములుగు జిల్లా వాజేడు మండలం చింతూరు గ్రామ పంచాయితీ పరిధిలోని లక్ష్మీపురం( గిర్రెగూడెం) ప్రతి ఆదివారం కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి పరిసర ప్రాంతాలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున పాల్గొంటున్న పందెం రాయుళ్లు జేబులు గుల్ల చేసుకుని ఆస్తులు తాకట్టు పెట్టే ఘటనలు ఎన్నో జరుగుతున్న బయటికి మాత్రం చెప్పుకోలేక ఎంతోమంది పందెం రాయుళ్లు మనోవేదన అనుభవిస్తున్నారు. కోడిపందాలను అరికట్టాల్సిన పోలీసులు అధికారులు అంటి ముట్టనట్టు ఆరు నెలలకు సంవత్సరానికి కోడిపందాలపై దాడులు చేయడం వలన దాడుల సమయంలో పట్టుబడిన పందెం రాయుళ్లపైన నామమాత్రంగా కేసులు పెట్టడంతో పందెం రాయుళ్లు కోడిపందాల లోకంలో తేలియాడుతూ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు ఇది ఇలాగే కొనసాగితే జనవరి ఫస్ట్ సంక్రాంతి పండుగలు అంటూ కోడిపందాలు ఉవ్వెత్తున కొనసాగే అవకాశం ఉన్నందున ఇకనైనా పోలీస్ అధికారులు స్పందించి మా ప్రాంతంలో జరిగే కోడిపందాలు అరికట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.