విద్యార్థుల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

విద్యార్థుల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
(యువతరం డిసెంబర్ 22) అమలాపురం ప్రతినిధి:
విద్యార్థులు బంగారు భవిష్యత్తు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేసి తద్వారాఉత్తమ ఫలితాలు సాధించిందని సాయి సంజీవిని మహిళా వాకర్స్ యోగ ఆరోగ్య సేవా సంస్థ అధ్యక్షురాలు సేవా శిరోమణి జల్లి సుజాత అన్నారు. అమలాపురం పట్టణంలోని వడ్డిగూడెం లో గల సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ కళాశాల బాలికల వసతి గృహం టు లో గురువారం రాత్రి జల్లి సుజాత ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 51 జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారని, అమ్మ ఒడి , విద్యా దీవెన, వసతి దీవెన వంటిపథకాల ద్వారా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని లక్ష్యంతో అంకితభావంతో విద్యా వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకువచ్చి పేదవాడి ముంగిట విద్యను నిలిపిన ఘనత నవరత్నాల సంక్షేమ సారధి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కిందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థినుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు వైభవంగా జరిపారు. విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త సీనియర్ తెలుగు లెక్చరర్ కవి కళాకారుడు నాటక రచయిత నల్లా నరసింహమూర్తి ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థినులకుమోటివేషన్ క్లాసులు నిర్వహించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వం అందిస్తున్న సాయంతో ఆత్మవిశ్వాసంతో క్రమశిక్షణతో విద్యను ఏకగ్రతతో అభ్యసించాలని ఆయన సలహా ఇచ్చారు. ప్రముఖ సాహితీవేత్త బీ.వీ.వి సత్యనారాయణ విద్యార్థులు ఆత్మవిశ్వాసం తో విజయాలు సాధించాలని దానికి నిరంతర కృషి పట్టుదల ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. అనంతరం జల్లి సుజాత వసతి గృహం లోని సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. విద్యార్థినిలు ఎన్ స్నేహలత నాగబత్తుల ధరణి ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలపై పాటలు పాడారు. ప్రముఖ కవి నల్లా నరసింహా మూర్తి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలపై కవితలు చదివారు. కార్యక్రమంలో అడబాల విజయలక్ష్మి, అడబాల పుండరీకాక్షుడు, వసతి గృహ సంక్షేమ అధికారిని వై. రోజా పుష్ప వార్డెన్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.