
మన పథకాలు దేశానికే ఆదర్శం
స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు
అభివృద్ధికి మద్దతుగానే కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీల నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు
గులాబీ కండువా లు పార్టీలోకి ఆహ్వానించిన…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్ రావు
(యువతరం సెప్టెంబర్ 2) భద్రాద్రి ప్రతినిధి.
భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డులో గల శుభం ఫంక్షన్ హాల్ లో భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్ రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ సహ ఇతర పార్టీలకు చెందిన సుమారు 500 కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు . ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ సహకారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నదని రానున్న రోజులలో భద్రాద్రి ఆలయాన్ని మరో యాదాద్రి ఆలయంలో తీర్చిదిద్దేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆయన గుర్తు చేశారు. దేశంలో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు . ప్రజలకు అండగా ఉండే ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలో అన్ని స్థానాలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని అన్నారు. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధి తెల్లం వెంకట్ రావు తోనే సాధ్యమని ఆయన అన్నారు. ఎన్నికలలో మన పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్ రావు ని గెలిపించాలని పార్టీ నేతలకు సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి వెళ్లి వివరించాలని కార్యకర్తలకు నాయకులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.