మార్కాపురంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం

మార్కాపురంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం
(యువతరం ఆగస్టు 19 )మార్కాపురం విలేఖరి:
మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారి ఆదేశాల మేరకు వారి సతీమణి కందుల వసంతలక్ష్మి మరియు నియోజకవర్గ పోల్ మేనేజ్ మెంట్ క్లస్టర్ ఇంచార్జి కందుల రామిరెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణం లో “మహాశక్తీ” భవిష్యత్ కు గ్యారంటీ మినీ మేనిఫెస్టో కార్యక్రమం మార్కాపురం పట్టణం లో 32 వ వార్డులో తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే వారికి ఏడాది 15000 రూపాయలు,ఆడబిడ్డ నిది క్రింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1500 రూపాయలు, దీపం పేరుతొ ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ శిలిoడర్లు ,మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 20 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 3000 నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏడాదికి 20000 ఆర్థిక సాయం తదితర పథకాలతో ప్రతి ఇంటికి ఏడాదికి 1,22,000 రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుల నాగలక్ష్మి,జిల్లా తెలుగు మహిళలు పోరుమామిళ్ల విజయలక్ష్మి,చెన్నా లక్ష్మి, మల్లికా సయ్యద్, జిల్లా అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి మెహరున్నిసా, తెలుగు మహిళ పారుమాంచాల సునీత తదితర మహిళలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.