ఎదురుపాడు గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

ఎదురుపాడు గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు
(యువతరం ఆగస్టు 19) కొత్తపల్లి విలేఖరి:
మండలంలోని ఎదురుపాడు గ్రామపంచాయితి వివిధ వార్డులలో వోల్టేజ్ పంప గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కోవడంతో లో వోల్టేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా అందించాలని ఉద్ద్యేశంతో గ్రామంలో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుచేయడం జరిగిందని గ్రామ సర్పంచి షేక్ నాజియా తెలిపారు. శనివారం మండలంలోని ఎదురుపాడు గ్రామంలో విద్యుత్ సిబ్బంది అద్వర్యంలో నూతన ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను విద్యుత్ శాఖ ఏఈ అబ్దుల్ అవీద్ దృష్టికి తీసుకెళ్ళడంతో వారు సానుకూలంగా స్పందించి విద్యుత్ అధికారుల సహకారంతో విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉండకూడదని రూ.7 లక్షల వ్యయంతో గ్రామంలో 48 కేవి వోల్ట్స్ కెపాసిటి గల ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో లైన్ మెన్ నాగేశ్వర్రెడ్డి, జునియర్ లైన్మెన్ స్వామిదయనందరెడ్డి, సిబ్బంది సర్వెశ్వరయ్య గ్రామప్రజలు పాల్గొన్నారు.