సర్పంచ్ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ గ్లాసు గుర్తుకు రెండు ఓట్లు మాత్రమే

సర్పంచ్ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ గ్లాసు గుర్తుకు 2 ఓట్లు మాత్రమే
(యువతరం ఆగస్టు 20) వీరులపాడు విలేఖరి:
వీరులపాడు మండలం దాచవరం గ్రామంలో శనివారం సర్పంచ్, ఉప ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 329, టిడిపి 300,జనసేన పార్టీకి 2 ఓట్లు రాగా. 29 ఓట్లతో వైఎస్సార్ పార్టీ బలపరిచిన గద్దె వెంకటేశ్వర్లు గెలుపొందారు. జనసేన పార్టీకి చెందిన నియోజకవర్గ నేత కామిశేట్టి వెంకటేశ్వరరావు ఈ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. కానీ ఈ ఎన్నికల్లో జనసేన బలపరిచిన అభ్యర్థికి 2 ఓట్లు మాత్రమే రావడం ఇక్కడ విశేషం జనసేన పార్టీ అభ్యర్థికి రెండు ఓట్లు రావడం నియోజకవర్గంలో చర్చనియంగా మారింది. నియోజవర్గం మేము జనసేన పార్టీ నాయకులు మని చెప్పుకొని గుండె మీద కొట్టుకునే నాయకులకు ఇక్కడ దాచవరం గ్రామంలో బంధువర్గం ఉన్నది కానీ ఇక్కడ ఆ బంధువర్గం కూడా జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయలేదు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఎంతో ఆశతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీయను అని ప్రతి మీటింగ్ లో చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇక్కడ మాత్రం నియోజకవర్గ జనసేన ఓటును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచారు.జనసేన పార్టీ అంటే మా సొంత పార్టీ అని చెప్పుకునే నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు జనసేన పార్టీకి వచ్చిన 2 ఓట్లు గురించి ఏమీ చెప్పుతారు నియోజకవర్గంలో ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు. నియోజవర్గంలో జనసేన పార్టీ గాజు గ్లాస్ పగిలిందని జన సైనికులు ఆవేదన చెందుతున్నారు.