ANDHRA PRADESHDEVELOPOFFICIALPOLITICS
సామాజిక భవనం ప్రారంభించిన నగర మేయర్

సామాజిక భవనం ప్రారంభించిన నగర మేయర్
(యువతరం ఆగస్టు 19 ) విశాఖ ప్రతినిధి:
విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శనివారం గాజువాక జోన్ 59 వ వార్డు పరిధిలోని కొత్త నక్కపాలెం ఆర్టీసీ డిపో జింక్ హనుమాన్ టెంపుల్ వద్ద శ్రీ గోకుల యాదవుల సామాజిక భవనం విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్, వార్డు కార్పొరేటర్ పి. పూర్ణ శ్రీ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఈ సామాజిక భవనం ద్వారా చుట్టుపక్కల ప్రజలకు ఫంక్షన్లు చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ శ్రీ గోకుల యాదవుల సామాజిక భవన నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మేయర్ కృతజ్ఞతలు తెలిపారు.