జగనన్న కాలనీ గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి

జగనన్న కాలనీ గృహ నిర్మాణాలను వేగవంతం
చేయాలి.
– హౌసింగ్ స్పెషల్ సెక్రెటరీ బి.ఎం.దివాన్.
(యువతరం ఆగస్టు 17) విశాఖ ప్రతినిధి :
జిల్లాలో జగనన్న కాలనీ గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్ స్పెషల్ సెక్రెటరీ బి.ఎం.దివాన్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశాఖ జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణ ప్రగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా హౌసింగ్ స్పెషల్ సెక్రెటరీ బి.ఎం.దివాన్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులు ఆదేశించారు. లేఅవుట్ లో మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. లబ్ధిదారులు గృహ నిర్మాణాలను వేగవంతం చేయుటకు అవసరమైన విద్యుత్, సిమెంటు, ఇసుక తదితర నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉంచాలని, సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. లేఅవుట్ లలో ఇంకుడు గుంతలు నిర్మించాలని పేర్కొన్నారు. లబ్ధిదారులందరికీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలని అన్నారు. ప్రతి జగనన్న లేఔట్ కాలనీలో ముఖ ద్వార ఆర్చును త్వరత గతిని నిర్మించాలని అన్నారు. లేఔట్లలో ప్రత్యేక శ్రద్ద వహించి డ్రైనేజీ, రోడ్లు, నీటి సదుపాయం మొదలు మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. గుత్తేదారులు యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డ్ ఎమినిటీ సెక్రటరీలను స్టేజ్ అప్డేట్ చేయుటలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సమీక్ష సమావేశంలో హౌసింగ్ పిడి శ్రీనివాసరావు , గ్రామీణ నీటి సరఫరా ఎస్.ఈ , వి ఎం అర్ డి ఎ
ఎస్.ఈ, ఈ పి డి సి ఎల్ ఎస్.ఈ, ఎంపీడీవోలు , వార్డ్ ఎమినిటీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.