గౌతమ బుద్ధ రోడ్డుపై ఆంబోతుల బీభత్సం

గౌతమ బుద్ధ రోడ్డుపై ఆంబోతుల భీభత్సం
వృద్ధురాలికి గాయాలు
ఆటో అద్దాన్ని సైతం ధ్వంసం చేసిన ఆంబోతులు
మంగళగిరి యువతరం ప్రతినిధి;
నగర ప్రధాన రహదారి గౌతమ బుద్ధా రోడ్డుపై శనివారం రాత్రి రెండు ఆంబోతులు భీభత్సం సృష్టించాయి. నడిరోడ్డుపై ఒకదానినొకటి పొడుచుకుంటూ వాహనదారులను భయబ్రాంతులకు గురిచేశాయి. అదే సమయంలో అటుగా వస్తున్న ద్విచక్ర వాహన దారుడు నడిరోడ్డుపై పొడుచుకుంటున్న ఆంబోతులను చూసి అంత దూరాన తన ద్విచక్ర వాహనాన్ని ఆపేసినా ఆంబోతులు ఒక్కసారిగా పొడుచుకుంటూ వేగంగా వెళుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వెనుక కూర్చొన్న వృద్ధురాలికి గాయాలయ్యాయి. దీంతో తోటి వాహనదారులు ఎవరూ ఆంబోతులను చెదరగొట్టే సాహసం చేయలేకపోయారు. కొద్ది సేపటి తరువాత మళ్లీ ఆంబోతులు మరింత రెచ్చిపోయి పొడుచుకుంటూ రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ఆటోను సైతం ఢీ కొట్టడంతో ఆటో అద్దం సైతం ధ్వంసమైంది. దీంతో వాహనదారులు ఆంబోతులను చెదరగొట్టే ప్రయత్నం చేసే లోపు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు రహదారులపై విచ్చలవిడిగా సంచరించే ఆంబోతులు, ఆవుల కట్టడికి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వాహనదారులు కోరుతున్నారు.