చిన్నపాటి చినుకులకే గ్రామాల్లో కనిపించని రహదారులు

చిన్నపాటి చినుకులకే గ్రామాల్లో కనిపించని రహదారులు : గొడిశాల రామనాథం.
పినపాక యువతరం ప్రతినిధి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,;పినపాక మండలం నారాయణపురం గ్రామం : గ్రామాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పాలకులు చెబుతున్న మాట. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. గ్రామ అభివృద్ధిలో భాగంగా రహదారుల బాగోగులు పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే శిలాఫలకానికే పరిమితమవుతున్నాడని, కాగితాల మీదనే అభివృద్ధి కనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు గొడిశాల రామనాథం విమర్శించారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పినపాక మండలంలోని నారాయణపురం గ్రామంలో రోడ్లను పరిశీలించి పినపాక నారాయణపురం నుండి బందగిరి నగరం వెళ్లే దారి భారీ వర్షాల వలన రోడ్డు మొత్తం బురదమయమై దారుణంగా ఉందని, మూడు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే క్రమంలో ఈ దారి మీదనే ఆధారపడి తమ ప్రయాణాలు సాగిస్తారని ప్రజలు, బడి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధ మహిళలు, వృద్ధులు అత్యవసర పరిస్థితులలో ఆసుపత్రులకు, ఇతర అవసరాలకు వెళ్లాలన్న తిరిగే పరిస్థితి లేదని అవస్థలు పడుతున్న ప్రజల కొరకు ప్రజా ప్రతినిధులు, గ్రామపంచాయతీ పాలకులు పట్టించుకునే నాధుడు కరువాయాడని జన రంజకమైన పాలన కొనసాగించే నాయుడికి ప్రజలు బ్రహ్మరథం పడతారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల బాగోగుల కోసం వారి అవసరాల్ని తీర్చే క్రమంలో రాజకీయాలని అడ్డుగా పెట్టుకొని గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన మరమ్మతులు చేయించాలని అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కొంబత్తిని శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ యాలం బుచ్చిబాబు, తాళ్లూరి కాంతారావు, కొండేరు రామారావు తదితరులు పాల్గొన్నారు.