నిరుపేదలకు జగనన్న సురక్ష ఓ వరం

నిరుపేదలకు జగనన్న సురక్ష…. ఓ వరం
చినగానపల్లి సర్పంచ్ సరస్వతి
అమడగూరు యువతరం విలేఖరి;
నిరుపేదలకు జగనన్న సురక్ష కార్యక్రమం ఓ వరం లాంటిదని చినగానిపల్లి సర్పంచ్ సరస్వతమ్మ పేర్కొన్నారు.శనివారం మండలం లోని చినగానిపల్లి గ్రామ సచివాలయం ఆవరణంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సరస్వతమ్మ మాట్లాడుతూ,కుల,మత,పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి మంచి చేయాలని ఉద్దేశంతో సచివాల వ్యవస్థను తీసుకొచ్చి ఆయా గ్రామాల్లోని ప్రజలకు మరింత దగ్గర అయ్యే విధంగా అన్ని సేవలను సచివాలయం ద్వారా ప్రజలకు సచివాలయ సిబ్బంది సేవలందిస్తున్నారు.మరీ ముఖ్యంగా సచివాలయ,వాలంటీర్ వ్యవస్థలను తీసుకువచ్చి ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలను అందిస్తున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు.జనన,మరణ, కుల,వివాహ ధ్రువీకరణ పత్రాలు వంటి 11 రకాల సేవలను జగనన్న సురక్ష ద్వారా ఉచితంగా ప్రజలకు అందిస్తున్నామన్నారు.చినగానిపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని గ్రామాల్లోని జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు,ఇన్కమ్ సర్టిఫికెట్లు,రేషన్ కార్డులు చేర్పులు మార్పులు,భూ సమస్యలు,ఆధార్,డెత్ సర్టిఫికెట్లు దాదాపు 760 వివిధ సర్టిఫికెట్లు ప్రజా ప్రతినిధులు,అధికారులు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వెంకట్ రెడ్డి,ఎంపీడీవో మునెప్ప,ఆర్ ఐ ఈశ్వరయ్య,వైఎస్ఆర్ సీపీ మాజీ మండల కన్వీనర్ శేషు రెడ్డి, ఎంపిటిసి నారాయణ,వైఎస్ఆర్ సీపీ నాయకులు శంకర,ఏపీఎం గోపాల్,పి ఆర్ ఇంజనీర్ గుప్తా,ఆర్డబ్ల్యూఎస్ జేఈ అనిల్,పంచాయతీ కార్యదర్శి నరేంద్ర,వీఆర్వో మోదిన్ భాష డిజిటల్ అసిస్టెంట్ అశోక్,గృహసారతులు,వాలంటీర్లు,ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.