డీఐజి గా పదోన్నతి స్వీకరించిన విక్రాంత్ పాటిల్ ఐపియస్


కర్నూలు జిల్లా జడ్జి , కర్నూలు రేంజ్ డిఐజి లను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన
డిఐజి విక్రాంత్ పాటిల్ ఐపియస్
డీఐజి గా పదోన్నతి స్వీకరించిన
విక్రాంత్ పాటిల్ ఐపియస్
అభినందనలు తెలిపిన
జిల్లా జడ్జి , కర్నూల్ రేంజ్ డిఐజి
కర్నూలు క్రైమ్ జనవరి 1 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ ఎస్పీ స్థాయి నుండి డీఐజీ గా పదోన్నతి స్వీకరించారు.
ఈ సందర్భంగా గురువారం జిల్లా జడ్జి కబర్థి ని , కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ ఐపియస్ లను డిఐజి విక్రాంత్ పాటిల్ ఐపియస్. మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
డీఐజీగా పదోన్నతి స్వీకరించిన విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కి జిల్లా జడ్జి , కర్నూల్ రేంజ్ డిఐజి అభినందనలు తెలియజేశారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో విక్రాంత్ పాటిల్ ని అడిషనల్ ఎస్పీలు , డీఎస్పీలు, సిఐలు , ఆర్ ఐలు, ఎస్సైలు, ఆర్ ఎస్ ఐ లు , డిపిఓ మినిస్టిరియల్ సిబ్బంది , ఇతర శాఖల సిబ్బంది కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో డిఐజి విక్రాంత్ పాటిల్, కర్నూల్ ఏపీఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెట్ శ్రీ దీపికా పాటిల్ ఐపిఎస్ కలిసి కుటుంబ సమేతంగా కేక్ కట్ చేసి స్పెషల్ బ్రాంచ్ సిబ్బందికి , క్యాంపు కార్యాలయంలోని సిబ్బందికి నూతన సంవత్సరo శుభాకాంక్షలు తెలిపారు.



