మంత్రాలయం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి వాల్మీకి బి లక్ష్మణ నాయకత్వంలో ముందుకు సాగుతాం

మంత్రాలయం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి వాల్మీకి బి లక్ష్మణ నాయకత్వంలో ముందుకు సాగుతాం
జనసేన పార్టీ కౌతాళం మండల నాయకులు కుంటనాల రాంప్రసాద్
మంత్రాలయం నియోజకవర్గం లో జనసేన పార్టీని గ్రామ గ్రామాన పటిష్టత పరుస్తాం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తాం.
మంత్రాలయం జనసేన పార్టీ ఇంచార్జ్ వాల్మీకి బి లక్ష్మన్న
మంత్రాలయం ప్రతినిధి సెప్టెంబర్ 9 యువతరం న్యూస్:
మంత్రాలయం నియోజకవర్గ మంత్రాలయం టౌన్ లో జనసేన పార్టీ ఇంచార్జ్ వాల్మీకి బి లక్ష్మన్న స్వగృహంలో కౌతాళం మండలం నాయకుడు కుంటనాల రాంప్రసాద్,మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జ్ వాల్మీకి బి లక్ష్మన్న కలిసి సన్మానించారు. మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జ్ వాల్మీకి బి లక్ష్మన్న, కౌతాళం మండలం నాయకులు కుంటనాల రాంప్రసాద్ భేటీ అయి జనసేనపార్టీ విషయాల గురించి చర్చించారు. కుంటనాల రాంప్రసాద్ మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం నుంచి కొన్ని కారణాల వలన పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని ఇకనుంచి మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి వాల్మీకి బి లక్ష్మన్న నాయకత్వంలో ముందుకు సాగుతామని, మంత్రాలయం నియోజకవర్గం లో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని,కుంటనాల రాంప్రసాద్, లక్ష్మన్నకు వాగ్దానం చేశారు. మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జ్ వాల్మీకి బి లక్ష్మన్న మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తున్నాయి కాబట్టి గ్రామ గ్రామాన జనసేన పార్టీని పటిష్టత పరిచి బలోపేతం చేస్తామని తెలిపారు. మా మంత్రాలయం నియోజకవర్గం లోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో పార్టీ పటిష్టత కొరకు కృషి చేయాలని లక్ష్మణ పిలుపునిచ్చారు. ఎన్డీఏ కూటమి తరఫున జనసేన పార్టీ కోటా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని లక్ష్మన్న తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆయన సిద్ధాంతాలను గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకు వెళ్తామని మంత్రాలయం జనసేన పార్టీ ఇంచార్జ్ వాల్మీకి బి లక్ష్మన్న, కౌతాళం మండల్ నాయకులు కుంటనాల రాంప్రసాద్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
రేపు అనంతపురంలో జరిగే మహాసభకు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వీర మహిళలు వేలాదిగా తరలివచ్చి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామని మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జి వాల్మీకి బి లక్ష్మన్న, కుంటనాల రాంప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు.