మాధవరం చెక్పోస్ట్ వద్ద అక్రమ మద్యం పట్టివేత

మాధవరం చెక్పోస్ట్ వద్ద అక్రమ మద్యం పట్టివేత
మంత్రాలయం ప్రతినిధి ఫిబ్రవరి 23 యువతరం న్యూస్:
మంత్రాలయ మండల కేంద్రంలోని మాధవరం లో ఫిబ్రవరి 22 వ తేదీ 2025 సంవత్సరం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు, కర్నూలు డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ.ఎస్. టాస్క్ ఫోర్స్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ ఇంటెన్డెంట్ రామకృష్ణారెడ్డి , సిఐ రాజేంద్ర వారి సిబ్బంది మంత్రాలయం మండలం మాధవరం చెక్ పోస్ట్ సిఐ చంద్రశేఖర్ నాయుడు వారి సిబ్బంది చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీ నిర్వహిస్తుండగా, ముగ్గురు వ్యక్తులు కర్ణాటక రాష్ట్రం నుంచి తెల్లటి టాటా సుమో గోల్డ్ లో కర్ణాటక మద్యం అక్రమంగా రవాణా చేస్తుండగా అదుపులోకి తీసుకొని సుమోను స్వాధీన పరచుకోవడం జరిగింది. ఈ ముగ్గురు వ్యక్తులలో మొదటి వ్యక్తి ఈడిగ వెంకటేశ్వర్లు వయస్సు 37 సంవత్సరాలు S/o ఈరన్న R/o రాయచూర్, కర్ణాటక రాష్ట్రం: రెండో వ్యక్తి తిమ్మయ్య, వయసు 20 సంవత్సరాలు S/o నాగేంద్ర S/o రాజోలి, కర్ణాటక రాష్ట్రం: మూడో వ్యక్తి నాగయ్య గౌడ్ R/o తలమర్రి, దేవనకొండ మండలం. వీర వద్ద నుంచి 30 బాక్సులు అనగా 2880 90 ఎమ్మెల్ ఒరిజినల్ ఛాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ ఎమ్మార్పీ ప్రకారం గా 1,15,200 అవుతుంది. పట్టుబడినటువంటి/ స్వాధీనం చేసుకోబడినటువంటి సుమో రిజిస్ట్రేషన్ నెంబర్ కే ఏ 36 బి 0418. ఈ కేసును ఎమ్మిగనూరు పొజిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఎమ్మిగనూరు నందు రిజిస్టర్ చేయడం జరిగింది, తదుపరి విచారణ అధికారి అయినటువంటి రమేష్ రెడ్డి ఈ కేసు విషయంలో ఈ కర్ణాటక మద్యం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరెవరికి సరఫరా అవుతుంది వంటి విషయాలపై లోతుగా విచారణ జరిపి కేసును ముందు తీసుకురావడం జరుగుతుందన్నారు.