ANDHRA PRADESHDEVOTIONALWORLD
భీష్మ ఏకాదశి వేడుకలు విజయవంతం చేయండి

భీష్మ ఏకాదశి వేడుకలు విజయవంతం చేయండి
కొత్తపల్లి ఫిబ్రవరి 6 యువతరం న్యూస్:
మండలం లోని కొలనుభారతి క్షేత్రంలో జరిగే భీష్మ ఏకాదశి వేడుకలు విజయవంతం చేయాలని కాకనూరు శారదా పీఠం పీఠాధిపతి శివయోగేంద్ర సరస్వతి ఆలయ సిబ్బందికి సూచించారు. గురువారం ఆయన కొలనుభారతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీష్మఏకాదశి సందర్భంగా ఈ నెల 9,10 జరిగే వేడుకల ఏర్పాట్ల పై సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.