జాతీయస్థాయి అండర్ -14 క్రికెట్ ఆంధ్ర జట్టు కెప్టెన్ గా శ్రీ లక్ష్మీ పాఠశాల విద్యార్థి రిత్విక కళ్యాణ్

జాతీయస్థాయి అండర్ -14 క్రికెట్ ఆంధ్ర జట్టు కెప్టెన్ గా శ్రీ లక్ష్మీ పాఠశాల విద్యార్థి
కర్నూల్ స్పోర్ట్స్ ఫిబ్రవరి 4 యువతరం న్యూస్:
స్థానిక ఎన్ ఆర్ పేట శ్రీలక్ష్మి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి వై. రిత్విక కళ్యాణ్ అమలాపురంలో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రికెట్ పోటీల్లో కర్నూలు జట్టు తరఫున రిత్విక కళ్యాణ్ 204 పరుగులు,
5 వికెట్లు తీసి జట్టు మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రతిభ కనబరిచారు. పాట్నాలో జరిగే అండర్ 14 జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో ఆంధ్ర ప్రదేశ్ జట్టు కెప్టెన్ గా సారాధ్యం వహించడం గర్వకారణమని శ్రీ లక్ష్మీ పాఠశాల డైరెక్టర్ పి దీక్షిత్ తెలిపి వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని క్రీడలతో శారీరక ధారుడ్యం మానసిక ఉల్లాసం ఉంటుందని తెలిపి రిత్విక్ కళ్యాణి అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, లోకేష్ నరేష్ మిన్నల అశ్విని విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.