ANDHRA PRADESHOFFICIALSTATE NEWS

వీఆర్వో కృష్ణమూర్తికి ఘన సన్మానం

వీఆర్వో కృష్ణమూర్తికి ఘన సన్మానం

వెల్దుర్తి జనవరి 31 యువతరం న్యూస్:

విజయవాడలో సిఎస్ ఇంతియాజ్ చేతుల మీదగా రిపబ్లిక్ డే సందర్భంగా వెల్దుర్తి మండలం లక్ష్మీ నగరం గ్రామ వీఆర్వో కృష్ణమూర్తి ఉత్తమ బిఎల్ఓ అవార్డు గ్రహీతగా అందుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో చంద్రశేఖర్ వర్మ ఆధ్వర్యంలో వీఆర్వోలు పూలమాల శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ చంద్రశేఖర వర్మ మాట్లాడుతూ అవార్డులు సాధించడం అంటే ఆషామాసి వ్యవహారం కాదన్నారు. ఎంతో కష్టపడితేనే అవార్డులు దక్కుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ వీఆర్వో కృష్ణమూర్తిని ఆదర్శంగా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!