ANDHRA PRADESHOFFICIALSOCIAL SERVICEWORLD
అన్నా క్యాంటీన్, సీఎం ఆర్ ఎఫ్ కు దాతల విరాళాలు
మంత్రి నారా లోకేష్ ను కలసి చెక్కులు అందజేత

అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్ కు దాతల విరాళాలు
మంత్రి లోకేష్ ను కలిసి చెక్కులు అందజేత
తాడేపల్లి ప్రతినిధి జనవరి 28 యువతరం న్యూస్:
పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్, ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు దాతలు విరాళాలు అందజేశారు.మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో మంత్రి లోకేష్ ను కలిసి చెక్కులు అందజేశారు. అన్న క్యాంటీన్ కు ఏలూరుకు చెందిన గుత్తా వెంకట కృష్ణారావు రూ.50వేలు, గుత్తా శారదాదేవి రూ.50వేలు, గుత్తా స్వరూపారాణి రూ.లక్ష విరాళం అందించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన జొన్నలగడ్డ శేఖర్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10వేల చెక్కును అందజేశారు. కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకునేందుకు, అన్న క్యాంటీన్ కు చేయూత ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వారిని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు.