పసుపు సైన్యం….@కోటి

పసుపు సైన్యం….కోటి
1,00,52,598 సభ్యత్వాలతో చరిత్ర తిరగరాసిన తెలుగుదేశం పార్టీ
లక్ష సభ్యత్వాల మార్క్ దాటిన 11 నియోజకవర్గాలు
50 వేల సభ్యత్వాల మార్క్ దాటిన 105 నియోజకవర్గాలు
కార్యకర్తల సంక్షేమం కోసం విప్లవాత్మక అడుగులు వేస్తున్న సంక్షేమ నిధి సారధి నారా లోకేష్
ప్రమాద భీమాను రూ. 5 లక్షలకు పెంచుతూ యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ తో ఒప్పందం
అమరావతి ప్రతినిధి జనవరి 17 యువతరం న్యూస్:
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది అక్టోబర్ 26 న టిడిపి అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వాలు తీసుకున్న వారి సంఖ్య కోటి మార్క్ ను దాటి చరిత్రను తిరగరాసింది. 1,00,52,598 మంది టిడిపి సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసారు. 11 నియోజకవర్గాలు లక్ష సభ్యత్వాల మార్కును దాటాయి. 105 నియోజకవర్గాలు 50 వేల సభ్యత్వాల మార్కును దాటాయి. కోటి మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ అతి పెద్ద కుటుంబంగా అవతరించింది.
టెక్నాలజీ అనుసంధానంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం సులభమైంది. ప్రజలు స్వయంగా సభ్యత్వ నమోదు చేసుకునే సౌలభ్యం కల్పిస్తూ వారు
ఎక్కువుగా వినియోగించే ప్లాట్ ఫామ్స్ తో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంత పెద్ద సక్సెస్ కావడానని ప్రధాన కారణం. టెక్నాలజీ వినియోగం ద్వారా పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో పార్టీ అధిష్ఠానానికి స్పష్టంగా తెలుస్తుంది. తద్వారా పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఇచ్చేప్పుడు ప్రాధాన్యత లభిస్తుంది. పనిచేసే వారికే ప్రాధాన్యత అని లోకేష్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదులో తాము చేసిన కష్టానికి గుర్తింపు లభిస్తుందని కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ ఎక్కువ సభ్యత్వాలు చేసిన కార్యకర్తలతో మాట్లాడి అభినందించడం, ప్రోత్సహించడం ఈ సక్సెస్ కు ప్రధాన కారణం.
టాప్ టెన్:
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పోటీపడి మరీ రికార్డులు సృష్టించారు. 11 నియోజకవర్గాలు లక్ష సభ్యత్వాల మార్కు దాటాయి. టాప్ టెన్ లో నెల్లూరు సిటీ 1,49,270, ఆత్మకూరు 1,48,802, పాలకొల్లు 1,48,559, రాజంపేట 1,45,766, కుప్పం 1,38,446, ఉండి 1,21,527, గురజాల 1,11,458, వినుకొండ 1,06,867, మంగళగిరి 1,06,145, కళ్యాణదుర్గం 1,01,221, కొవూరు 1,00,473 నియోజకవర్గాలు ఉన్నాయి.
లైఫ్ టైమ్ మెంబర్షిప్:
శాశ్వత సభ్యత్వాలకు కూడా పెద్ద ఎత్తున స్పందన లభించింది. మంగళగిరి – 145, ఆత్మకూరు – 137, వినుకొండ – 79, గంగాధర నెల్లూరు – 62, తణుకు – 60 నియోజకవర్గాలు టాప్ ఫైవ్ లో నిలిచాయి.
కార్యకర్తల సంక్షేమం:
కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులుగా భావిస్తుంది. వారి సంక్షేమానికి భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసి..టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కార్యకర్తలు.. వారి కుటుంబసభ్యుల విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తున్నారు. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబానికి ప్రమాదభీమా అందించి ధీమా కల్పిస్తున్నారు.
టిడిపి కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యత లోకేష్ కు అప్పగిస్తున్నామని 2014 మహానాడులో టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు. నాటి నుంచి నేటివరకూ కార్యకర్తల పెన్నిధిగా వ్యవహరిస్తున్న లోకేష్ సంక్షేమనిధితో ఆదుకుంటున్నారు. ఇప్పటివరకు 2500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సహాయం చేశారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5164 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల రూపాయలు చొప్పున రూ. 103 కోట్ల 28 లక్షల రూపాయలు అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలకు వైద్య సహాయం అందించారు. సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి రూ. 19 కోట్లు ఆర్థిక సహాయం చేశారు. రూ.100తో సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం చూసేందుకు లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి వెల్ఫేర్ వింగ్ అవిశ్రాంతంగా పని చేస్తోంది. ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య, ఉపకారవేతనాలు, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫీజుల్లో రాయితీలుగా రూ. 2 కోట్ల 35 లక్షల రూపాయలు చెల్లించారు. చదువు పూర్తయిన వారికి ఉపాధి..ఉద్యోగావకాశాలు సాధించేలా నైపుణ్యశిక్షణ ఇస్తున్నారు.
ప్రస్తుతం అదే రూ.100తో తీసుకున్న సభ్యత్వం ద్వారా వచ్చే ప్రమాద బీమా ప్రయోజనాన్ని రూ. 5 లక్షలకు పెంచారు. నారా లోకేష్ సమక్షంలో కోటి మందికి ప్రమాద భీమా కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ మధ్య ఒప్పందం చేసుకున్నారు.