మంగళగిరిలో పోటా పోటీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు

మంగళగిరిలో పోటాపోటీగా ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు
నాలుగో రోజు విజయం సాధించిన పశ్చిమగోదావరి, గుంటూరు జట్లు
మంగళగిరి ప్రతినిధి జనవరి 16 యువతరం న్యూస్:
మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ పోటీలు పోటాపోటిగా సాగుతున్నాయి. నాలుగో రోజు అయిన బుధవారం పశ్చిమగోదావరి వర్సెస్ కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పశ్చిమగోదావరి జట్టు గెలుపొందింది. టాస్ గెలిచి కర్నూలు జట్టు ఫిల్డింగ్ తీసుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పశ్చిమగోదావరి జట్టు 6 వికెట్ల నష్టంతో 175 పరుగులు చేసింది. తర్వాత 176 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కర్నూలు జట్టు 153 పరుగులు చేసి ఓటమి చెందింది. గుంటూరు వర్సెస్ శ్రీకాకుళం మధ్య జరిగిన మ్యాచ్‌లో గుంటూరు జట్టు గెలిచింది. గుంటూరు జట్టు నిర్ణిత 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టంతో 145 పరుగులు చేసింది. 146 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీకాకుళం జట్టు 7 వికెట్ల నష్టంతో 130 పరుగులు చేసి ఓటమి చెందింది. పశ్చిమగోదావరి జట్టులో 50 బంతుల్లో 77 పరుగులు చేసిన వేంపాటి జాస్వీన్, గుంటూరు జట్టులో 33 బంతుల్లో 48 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ చేసి మూడు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసిన కె మహీప్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. ఇద్దరికి పట్టణ తెలుగు యువత అధ్యక్షులు భోగి వినోద్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కనికళ్ళ చిరంజీవి సహకారంతో ఒక్కోక్కరికీ రూ 10 వేలు చొప్పున నగదు బహుమతి అందజేశారు. ఈవెంట్ స్పాన్సర్లగా సేల్, సక్కు, మార్కోరోస్, ఉషోదయ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ప్రతి మ్యాచ్‌ను గోపి టీవి యూట్యూబ్ ఛానల్, వి డిజిటల్ ద్వారా ప్రత్యక్ష ప్రచారం అందించడం జరుగుతుంది. ప్రీమియర్ లీగ్, సిజన్-3 పోటీలలో ప్రథమ బహుమతి కింద రూ 3 లక్షలు కొమ్మారెడ్డి కిరణ్, ద్వితీయ బహుమతి కింద రూ 2 లక్షలు కాట్రగడ్డ మధు సుధన్ రావు, తృతీయ బహుమతి కింద రూ. లక్ష నగదును పల్నాటి నాగేశ్వరరావు, అమ్మిరెడ్డి సాంబశివరావు సహకారంతో బహుమతులు ప్రధానం చేయనున్నారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రూ. 50 వేలు బత్తుల హరిదాస్, బెస్ట్ బ్యాట్స్ మెన్ కు రూ 25 వేలు కాసరనేని జస్వంత్, బెస్ట్ బౌలర్ కు రూ 25 వేలు తాడిపత్రి అజయ్ కుమార్, ప్రతి మ్యాచ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రూ.10 వేల నగదును భోగి వినోద్, కనికళ్ళ చిరంజీవి సహకారంతో నగదు బహుమతులు అందించనున్నారు.