పల్లె నుంచి పట్నం దాకా ఒకే అభివృద్ధి జరగాలి

పల్లె నుంచి పట్నం దాకా ఓకే అభివృద్ధి జరగాలి
ఇదే కూటమి ప్రభుత్వం లక్ష్యం
బుక్కరాయసముద్రం జనవరి 15 యువతరం న్యూస్:
బుక్కరాయసముద్రం మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఆదేశాల మేరకు సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీపీ దాసరి సునీత . కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అభివృద్ధి సంక్షేమం రెండు పరుగులు పెడుతున్న సమయంలో మండలంలోరూ.26 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్ల శిలా ఫలకం ప్రారంభం
బుక్కరాయసముద్రం మండలం, వడియంపేట, దయ్యాలకుంటపల్లి గ్రామంలలో “పల్లె పండుగ” కార్యక్రమం కింద రూ.26 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు సంక్రాంతి పండుగ లోపు సీసీ రోడ్లు పూర్తి చేయాలని ఆదేశించినారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సారధ్యంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా పూర్తయిన సీసీ రోడ్ల శిలా ఫలకం ను ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సునీత, ఎంపీడీఓ సల్మాన్ రాజ్, మండలం ఇంజనీరింగ్ అధికారి మద్దిలేటి, జిల్లా సీనియర్ టీడీపీ నాయకులు పసపల శ్రీరామి రెడ్డి, పొడరాళ్ల రవీంద్ర, దయ్యాలకుంటపల్లి మాజీ సర్పంచ్ పెద్దప్ప, వడియంపేట సర్పంచ్ నాగార్జున,ఆదినారాయణ బి కే ఎస్ మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ,కేసన్న,ఓబులపతి, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.