ఈ మకర సంక్రాంతి పండుగ ప్రతి ఇంట ఆనందం వెళ్లివిరియాలి

ఈ మకర సంక్రాంతి పండుగ ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి
జిల్లా వైయస్సార్సీపీ నాయకుడు ఆలూరు సాంబశివరెడ్డి
బుక్కరాయసముద్రం జనవరి 15 యువతరం న్యూస్:
బుక్కరాయసముద్రం మండల ప్రజలకు మరియు ప్రజలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
మకర సంక్రాంతి పండుగ.. సుఖ సంతోషాల సంక్రాంతి.. కమ్మని వంటల కనుమ.. కలబోసి అందరి ఇంట ఆనందం వెల్లివిరియాలని జిల్లా వైయస్సార్సీపి నేత ఆలూరు సాంబశివారెడ్డి ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బుక్కరాయసముద్రం మండల ప్రజలు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు మరియు ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక మకర సంక్రాంతి‘ అని పేర్కొన్నారు. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని, రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి దేశచరిత్రలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నదాతల సంక్షేమానికి చర్యలు తీసుకున్నారని జిల్లా వై.ఎస్.ఆర్. సి. పి నాయకుడు ఆలూరు సాంబశివరెడ్డి గుర్తు చేశారు. ప్రతి కుటుంబం భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.