ఘనంగా మకరజ్యోతి పూజ మహోత్సవం

ఘనంగా మకర జ్యోతి పూజా మహోత్సవం
మంగళగిరి ప్రతినిధి జనవరి 16 యువతరం న్యూస్:
నవులూరు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి వారి దేవస్థానంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం రాత్రి శ్రీ అయ్యప్పస్వామి వారి మకర జ్యోతి దర్శన పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్పస్వామి వారికి అభిషేకం నిర్వహించి ఆభరణాలను అలంకరించారు. స్వామివారి 18 మెట్లను రంగురంగు పూలమాలతో అలంకరించి పడిపూజ నిర్వహించారు. గ్రామ ప్రజలతోపాటు మంగళగిరి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి పూజలు నిర్వహించి మకర జ్యోతిని దర్శించుకున్నారు. మధిర శ్రీనివాసరావు గురుస్వామి, రుద్రు బాబురావు గురుస్వామి, పురోహితులు మధు, హనుమాన్ శాస్త్రి పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 4000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా విశ్వవేద మహాగ్రంథం గ్రంథకర్త గ్రామానికి చెందిన తాడికొండ శివాజీ, శ్రీమతి కళ్యాణి దంపతులను దేవస్థానం కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ గౌరవాధ్యక్షులు కొల్లి లక్ష్మయ్య చౌదరి, అధ్యక్షులు రుద్రు బాబురావు గురుస్వామి, ఉపాధ్యక్షులు ఆడేపు శివ నాగేశ్వరరావు, కార్యదర్శి బత్తుల సాంబశివరావు, సహాయ కార్యదర్శి రంగెశెట్టి శంకరరావు, కోశాధికారి బత్తుల శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు రుద్రు సాంబశివరావు, ఆదినీడి శంకర్, మాగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.