ANDHRA PRADESHSOCIAL SERVICE
ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు
కారంపూడి జనవరి 15 యువతరం న్యూస్:
కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలోని సత్రం ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. సంక్రాంతి పండుగను కళ్లకు కట్టినట్లుగా ముగ్గుల రూపంలో మహిళలు తీర్చిదిద్దారు. అనంతరం చిన్నారులకు కుర్చీ ఆటల పోటీలు నిర్వహించారు.ముగ్గుల పోటీల్లో మొదట బహుమతి డాక్టర్ కొండపల్లి నాగేశ్వరావు, రెండో బహుమతి ఓగూరి.బుల్లిబ్బాయి, మూడవ బహుమతి కొండపల్లి. చిన్న అప్పారావు అందించారు. ఈ నేపథ్యంలో పోటీల్లో గెలిచిన మహిళలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. కొండపల్లి అమరలింగయ్య, ఓగురి. బుల్లిఅబ్బాయి, కొండపల్లి. అప్పారావు, జడ్జిలు గా కాటంరెడ్డి నాగలక్ష్మి రెడ్డి, యాగంటి లక్ష్మి, మహిళలు భారీగా పాల్గొన్నారు.