ఈవీఎం గోడౌన్ తనిఖీ

ఈవిఎం గొడౌను తనిఖీ
అనకాపల్లి ప్రతినిధి డిశంబరు 30 యువతరం న్యూస్:
జిల్లా ఎస్.పి. కార్యాలయం ప్రాంగణంలో గల ఇ వి ఎం గొడౌను ను జిల్లా కలెక్టరు మరియు జిల్లా ఎన్నికల అధికారి విజయ కృష్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీచేసారు. గొడౌను త్రైమాసిక తనిఖీలలో భాగంగా గొడౌను సీళ్లను తీసి, నియోజకవర్గాల వారీగా భద్రపరచిన స్ట్రాంగు రూంలను తనిఖీచేసారు. సిసి కెమెరాలు, అగ్నిమాపక పరికరాలను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. తనిఖీ అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గొడౌనుకు సీళ్లను వేసారు.
ఈ కార్యకమంలో జిల్లా రెవిన్యూ డివిజినల్ అధికారి వై.ఎస్.వి.కె.జి.ఎస్.ఎల్. సత్యనారాయణరావు, అనకాపల్లి రెవిన్యూ డివిజినల్ అధికారి షేక్ ఆయిషా, అనకాపల్లి అగ్నిమాపక అధికారి పి.నాగేశ్వరరావు, ఎలక్షన్ సెక్టను సూపరింటెండెంటు ఎస్.ఎస్.వి.నాయుడు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బి. శ్రీనివాసరావు, ఆప్ పార్టీ ప్రతినిధి కె.హరినాధబాబు, బిజెపి ప్రతినిధి పి.నాగేశ్వరరావు, వైఎస్ఆర్సిపి ప్రతినిధి జి.రాజు, ఐఎన్ సి ప్రతినిధులు వి. వెంకట సత్యనారాయణ, టి.రమణ పాల్గొన్నారు.