ANDHRA PRADESHOFFICIAL
అటవీ భూముల పై విచారణ

అటవీ భూముల పై విచారణ
కొత్తపల్లి సెప్టెంబర్ 14 యువతరం న్యూస్:
కొత్తపల్లి మండలంలోని అటవీ భూముల పై అత్మకూరు అటవీశాఖ రేంజ్ అధికారి పట్టాభి, డిప్యూటీ తాసిల్దార్ పెద్దన్నలు విచారణ చేపట్టారు శుక్రవారం గువ్వలకుంట్ల, ఎదురుపాడు గ్రామాల సమీపంలోని అటవీ భూములను పరిశీలించారు గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన కొంత మంది రైతులు తమ భూములు 2011 అటవీ శాఖకు అప్పగించామని,మా భూములు మాకే కావాలని హైకోర్టులో పిటిషన్ వేయడంతో వారి ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని వివరించారు. విచారించిన నివేదికను ఉన్నత అధికారులకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.