
అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
కొత్తపల్లి సెప్టెంబర్ 14 యువతరం న్యూస్:
గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆత్మకూర్ రూరల్ సిఐ సురేష్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఆయన శుక్రవారం మండలంలోని గువ్వలకుంట్ల, జీ. వీరాపురం గ్రామాల్లో కొత్తపల్లి ఎస్సై కేశవ ఆధ్వర్యంలో గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు పోలీస్ సేవలు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాల పై అవగాహన కల్పించారు ప్రజలు శాంతియుత వాతవరణంలో జీవనం సాగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.