ఒక్క దరఖాస్తు కూడా రీఓపెన్ కాకూడదు

ఒక్క దరఖాస్తు కూడా రీఓపెన్ కాకూడదు
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు ప్రతినిధి సెప్టెంబర్ 10 యువతరం న్యూస్:
ఫిర్యాదులకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా రీఓపెన్ కాకూడదని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ – పిజిఆర్ఎస్) కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రీ ఓపెన్ ఇంకా చూడనివి(వైఇటి టు వ్యూ ) గడువు దాటిన కేసులపై సమీక్షించారు. రీ ఓపెన్ 37,ఇంకా చూడనివి(వైఇటి టు విఐడబెల్యూ)21 సిఎం గ్రీవెన్స్ 34 గడువు దాటినవి ఒక్క ఫిర్యాదు ఉన్నాయన్నారు. వీటికి సంబంధించిన అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి అని శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఒక్క ఫిర్యాదు కూడా రీ ఓపెన్ కాకూడదని నాణ్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.