రోడ్డు ప్రమాదంలో ఇరువురు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇరువురు దుర్మరణం
వెల్దుర్తి ఆగస్టు 31 యువతరం న్యూస్:
వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదార్ పురం గ్రామ సమీపంలో జాతీయ రహదారి 44 పై శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డోన్ కు చెందిన డేవిడ్ పాల్, పాలెం జయకుమార్ ఇరువురు డోన్ వైపు వెళుతుండగా వెనుకవైపు నుండి వస్తున్న లారీ ఢీకొనడంతో ఇరువురు అత్యంత ఘోరంగా మృత్యువాత పడ్డారు. ఏపీ 39 GE 9306 అనే మోటార్ బైక్ పై వెళుతుండగా RJ11GC 4981 అనే లారీ వెనుక వైపు నుండి ఢీ కొట్టినట్లు సమాచారం. ప్రమాద సంఘటన స్థలం చూస్తే ప్రతి ఒక్కరికి ఒళ్ళు జలదరించేలా తల, మొండెం వేరు అయ్యి దారుణంగా ప్రమాదానికి గురయ్యారు. బైక్ ను వెనకవైపు నుండి ఢీ కొట్టిన లారీ ఈడ్చుకొని వెళ్లి నట్లు అగుపడుతోంది. బైకు లారీలో ఇరుక్కొని పోయింది. ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమేనని పలువురు పేర్కొంటున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.