మంత్రి డోలా కు చర్మకారుల వినతి

మంత్రి డోలా కు చర్మకారులు వినతి
మంగళగిరి ప్రతినిధి ఆగస్టు 29 యువతరం న్యూస్:
వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామిని గురువారం ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం అధ్యక్షులు బుల్లా రాజారావు ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు కలిసి చర్మకారుల సమస్యలపై వేర్వేరుగా రెండు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంగళగిరిలో బుల్లా మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలోని 250 మంది డప్పు కళాకారులు, చర్మకారులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించాలని, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాలలో 2 లెదర్ పార్కులు నిర్మించాలని మంత్రికి ఇచ్చిన వినతి పత్రాల్లో కోరడం జరిగిందన్నారు. సంఘం నాయకులు వీ మరియదాస్, సీ గంగులయ్య, పీ గంగాధర్, కే రమేష్ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం మంత్రి డోలా విజిలెన్స్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.