ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWSOFFICIALSTATE NEWS
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అధికారుల విచారణ

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అధికారుల విచారణ
కృష్ణాజిల్లా యువతరం డెస్క్:
కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమేరాలు ఉన్నాయనే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. హాస్టల్ లో రహస్య కెమేరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని సిఎం ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ లను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇంజనీరింగ్ కాలేజీ ఘటన పై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో పాటు, ఎస్పీ గంగాధర్ రావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థినుల ఆందోళనపై వాస్తవ పరిస్థితులను విచారిస్తున్నారు.