విద్యార్థులు మానసిక దృఢత్వంతో ఉండాలి

విద్యార్థులు మానసిక దృఢత్వంతో ఉండాలి
ఆత్మస్థైర్యం పట్టుదల క్రమశిక్షణతో మీరు ఎంచుకున్న నిర్దేశం కోసం పోరాడాలి
మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ విజ్ఞప్తి
మంగళగిరి ప్రతినిధి ఆగస్టు 29 యువతరం న్యూస్:
జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని నిర్మల స్కూల్, కాలేజీ వారు ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ మంగళగిరి మండలం రూరల్ పరిధిలోని నిర్మల హై స్కూల్ లో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల క్రమశిక్షణతో వారు ఎంచుకున్న లక్ష్యానికి అనునిత్యం పోరాడాలని దాని అనుగుణంగా ఒక క్రమశిక్షణతో పోరాడి సాధించాలని, అంతేకాక మానసికంగా ధైర్యం పట్టుదలతో ఉండాలని గెలుపోటములకు బాధపడకుండా, జీవితంలో గెలుపు ఓటమి సర్వసాధారణమని దేనినైనా పాజిటివ్ గా తీసుకొని ఓటమిని జయించి గెలుపొందాలని రూరల్ ఎస్ఐ వెంకట్ సూచించారు. జీవితంలో ప్రతి అడుగు ముఖ్యమైనదని దానిని ఒక పాటను తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు. ఇటీవల కాలంలో విద్యార్థులు మానసిక ధైర్యం లేక చిన్న చిన్న విషయాలకు తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారని తద్వారా వారి కుటుంబాలలో తీరని ఆవేదన మిగులుస్తున్నారని విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా తమ విలువైన భవిష్యత్తును బంగారు బాటగా చేసుకోవాలని రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ సూచించారు.