వరల్డ్ పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన సాదియా

సాదియా సాధించెన్… వరల్డ్ పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్
మంగళగిరి ప్రతినిధి ఆగస్టు 29 యువతరం న్యూస్:
మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మస్ మరోసారి మెరిసారు. మాల్టా దేశంలో ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 8వరకు జరిగే జూనియర్ వరల్డ్ మెన్ అండ్ ఉమెన్ ఎక్విప్పుడు పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో సాదియా అల్మస్ 57 కేజీల విభాగంలో వోవరాల్ గోల్డ్ మెడల్ సాధించింది. స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 97.5 కేజీలు, డెడ్ లిఫ్ట్ 175 కేజీలు మొత్తంగా 462.5 కేజీల బరువుఎత్తి వోవరాల్ గోల్డ్ మెడల్ సాదించి మంగళగిరి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. ఈ మేరకు సాదియా తండ్రి, కోచ్, ఫిట్ జోన్ అధినేత షేక్ సందాని మంగళగిరి టైమ్స్ కు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ను సాదియా ఆర్థిక సహాయం కోరగా, ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరిట మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించిన విషయం విదితమే.