మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి శేష వస్త్రం సమర్పించిన టిటిడి

మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి వారికి శేషవస్త్రం సమర్పించిన టిటిడి
మంత్రాలయం ఆగస్టు 19 యువతరం న్యూస్:
మంత్రాలయంలోని శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి 353 వ ఆరాధన మహోత్సవాల సందర్భంగా టిటిడి తరఫున ఈ. ఓ. శ్యామల రావు దంపతులు ఆదివారం సాయంత్రం శేషవస్త్రం సమర్పించారు.
ముందుగా మంత్రాలయం ఆలయం వద్దకు చేరుకున్న ఈవో దంపతులకు శ్రీ రాఘవేంద్రస్వామి మఠం మేనేజర్లు ఎస్.కె. శ్రీనివాస్ రావు,వెంకటేష్ జోషి,మాధవ శెట్టి,శ్రీపతా చార్ లు అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం శేష వస్త్రాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆలయంలో పీఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారికి అందించి శ్రీ రాఘవేంద్ర స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. పీఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారు ఈవో దంపతులకు శేషవస్త్రం,శ్రీ రాఘవేంద్ర స్వామీ మూమేంటో ,ఫల మంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు.