హోసూరులో తెదేపా నేత దారుణ హత్య

హోసూర్ లో దారుణ హత్య
మారుణాయుధాలతో టిడిపి నాయకుడు పై దాడి
కారం చల్లి ఆధారం లేకుండా జాగ్రత్త పడ్డ దుండగులు
హోసూర్ గ్రామాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్
దుండగులను పట్టుకొని శిక్ష వేస్తాం : ఎస్పి బిందు మాధవ్
పత్తికొండ ప్రతినిధి ఆగస్టు 15 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లాలో బగ్గు మన్నఫ్యాక్షన్ బుధవారం తెల్లవారుజామున తెలుగుదేశం నాయకుడు పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా, దారుణంగా , వేట కొడవళ్లతో దాడి చేసే అతి చంపారు. ఒక్కసారిగా ఈ హత్యతో కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది. చాలా కాలం తర్వాత హత్య జరగడం గ్రామ ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
పోలీసుల కథనం మేరకు గ్రామ ప్రజల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. పత్తికొండ మండల పరిధి లోని హోసూరు గ్రామంలో వాకిటి శ్రీనివాసులు ను బుధవారం తెల్లవారు జామున ఐదు గంటలకు హత్యకు గురైన సంఘటన. గ్రామ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. శ్రీనివాసులకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేస్తూనే తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదుగుతూ వచ్చిన జీ శ్రీనివాసులు భార్య మేజర్ గ్రామపంచాయతీ అయినా హోసూరు సర్పంచ్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం శ్రీనివాసులు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు..
విషయం తెలుసుకున్న పోలీసులు
హుటాహుటిన బుధవారం హోసూర్ గ్రామాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సందర్శించారు ఈ సం దర్భంగా హోసూర్ గ్రామంలో వాకిటి శ్రీనివా సులు హత్యకు గల కారణాలను పత్తికొండ డిఎస్పి శ్రీనివాసులు రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎ స్పీ బిందు మాధవ్ విలేకరులతో మాట్లాడు తూ వాకిటి శ్రీనివాసులు హత్య కేసును న మోదు చేసుకొని హత్య జరిగిన సంఘటన గురించి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్న ట్లు త్వరలో హత్య చేసిన వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేస్తామని వెల్లడించా రు హోసూర్ గ్రామంలో ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీ సు బందోబస్తు నిర్వహించాలని పత్తికొండ డిఎస్పి పి శ్రీనివాస్ రెడ్డికి జిల్లా ఎస్పీ ఆదే శాలు జారీ చేశారు.
ఈ హత్యను చేదించేందుకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని జిల్లా ఎస్పీ వెల్లడించారు.