విద్యార్థులకు టీడీ వ్యాక్సినేషన్

విద్యార్థులకు టీడీ వ్యాక్సినేషన్
మంగళగిరి ప్రతినిధి జులై 27 యువతరం న్యూస్:
మంగళగిరి వీవర్స్ కాలనీ ఎంటీఎంసీ హైస్కూల్లో స్థానిక గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు టీడీ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పీ అనూష వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డాక్టర్ అనూష మాట్లాడుతూ డిఎంహెచ్వో విజయలక్ష్మి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుబ్బరాజు ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. 10, 16 సంవత్సరాల పిల్లలకు మాత్రమే టీడీ వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. పిల్లలకు టెటానస్, డిఫ్తీరియా వ్యాధులు సోకుతాయన్నారు. పిల్లలకు టెటానస్, డిఫ్తీరియా వ్యాధులు సోకకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా ప్రభుత్వం టీడీ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతుందన్నారు. పిల్లలు ఆటలాడుకునేటప్పుడు తగిలే గాయాల ద్వారా టెటానస్ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కు గురవుతారన్నారు. డిఫ్తీరియా వ్యాధి ఒకరి నుండి మరొకరికి సోకుతుందన్నారు. ఈ వ్యాధులు రాకుండా ఉంటానికి పిల్లలకు తల్లిదండ్రులు టీడీ వ్యాక్సినేషన్ తప్పకుండా వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ సూపర్వైజర్ వెలగపూడి జయలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.