మలేరియా మరియు డెంగ్యూ వ్యతిరేక మాసోస్తవం

తిప్పారెడ్డిపల్లె మరియు కొట్టాలపల్లి,పుప్పాల గ్రామాలలో మలేరియా మరియు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం
యాడికి జులై 26 యువతరం న్యూస్:
మలేరియా ,డెంగ్యూ వ్యాధుల నియంత్రణ లో భాగం లో ఈ రోజు యాడికి పి.హెచ్.సి పరిధిలో ఉన్నటువంటి తిప్పారెడ్డి పల్లెలో మరియు రాయలచెరువు పి.హెచ్.సి పరిధి లో వున్న కొట్టాలపల్లి కుంట లోనూ ,పుప్పాల కుంటలోనూ గంబుషియ చేప పిల్లలను వదలడమైనది .వీటిని తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ వారు పి.హెచ్. సి నకు సరఫరా చేసినారు . ఈ కుంటలు గ్రామం నకు దగ్గరలో వున్నవి .వీటిలో నీరు ఎప్పుడు నిల్వ వుంటాయి కావున దోమ లార్వాలు , దోమలు పెరగడానికి ఎక్కువ అవకాశం వుంది కావున గంబుషియా చేప పిల్లలను వదలడ మైనది .ఈ చేపలు దోమ గ్రుడ్లను లార్వా లను తింటాయి .తద్వారా దోమలు వృద్ధి చెందవు .ఈ కార్యక్రమం లో యాడికి పి.హెచ్.సికి సంబంధించిన మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు మరియు డాక్టర్ శ్రీరామ్ కుమార్, డా .సి . అప్పయ్య , జె . షబ్బీర్, సూపర్ వైజర్ రాంప్రసాద్ గౌడ్ , వై .నాగరాజు , వి .సుజాత ఆరోగ్య కార్య కర్తలు , ఆశా కార్య కర్త పద్మావతి . కే . ప్రసాద్ రెడ్డి ఎంపీటీసీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు .