దళారీలుగా వసూళ్లకు పాల్పడితే తాటతీస్తా……
పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్

దళారీలుగా వసూళ్లకు పాల్పడితే తాట తీస్తా
పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ ఘాటైన హెచ్చరిక
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా
-ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్
పత్తికొండ ప్రతినిధి జూలై 2 యువతరం న్యూస్:
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎవరికైనా ఇప్పిస్తామని దళారీలుగా అక్రమ వసూళ్లకు తెరలేపితే సహించేది లేదని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం పత్తికొండలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు. చెరువులు నింపి, పంటకాలువలకు నీరు అందించి రైతులకు సాగునీటి అవసరాలు తీర్చడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. దీంతో పాటు ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఏమైనా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని తమ గౌడ్ల కులం పేరుతో నాయకులు, పార్టీ కార్యకర్తలు ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిని ఉపేక్షించేది లేదన్నారు. పార్టీలోనుంచి కూడా తొలగించేందుకు ఏమాత్రం వెనుకాడబోమన్నారు. ఇలాంటివి ఏమైనా తన దృష్టికి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యేకు చెబుదాం పుస్తకాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఈపుస్తకంలో ఎవరైనా తన దృష్టికి సమస్యను తీసుకొస్తే వాటికి పరిష్కారాన్ని కూడా చూపించి వారికి ఫోను చేసి తెలియజేస్తామన్నారు. ఎక్కడా దళారీ వ్యవస్థకు తావులేకుండా పారదర్శకమైన పరిపాలన అందించేందుకు ఈప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు.
మునస్థాపానికి గురైన గౌడ్స్..
ప్రభుత్వ పథకాలు వాలంటీర్లు ఇప్పిస్తామని చెప్పి శ్యామ్ కుమార్ మా అన్నా మా పెదనాయన అని ఎవరైనా ప్రబాల గురి చేస్తే వారి తాటాకు ఇస్తానని గౌడ్స్ గౌడ్ కులస్తులకు ప్రత్యేకంగా అనడంతో అందరూ ఆశ్చర్యానికి గురై మనస్థాపన చెందారు.
ఈకార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాద్యక్షుడు సాంబశివారెడ్డి, నాయకులు ప్రమోద్కుమార్రెడ్డి, బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు,పురుషోత్తం చౌదరి, తిమ్మయ్య చౌదరి, మనోహర్షిచౌదరి, కడవల సుధాకర్, తిరుపాల్, తదితరులు పాల్గొన్నారు.