ANDHRA PRADESHOFFICIALTELANGANA
ములగలంపల్లిలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి

ములగలంపల్లి లో పేకాట శిబిరంపై పోలీసుల దాడి
జీలుగుమిల్లి జులై 22 యువతరం న్యూస్:
జీలుగుమిల్లి మండలంలోని ములగలంపల్లి గ్రామ శివారులో శనివారం పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.50,050 నగదు, 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి.చంద్ర శేఖర్ తెలిపారు.