136 వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం బ్రోచర్లు ఆవిష్కరణ

జూన్ 30 వ తేదీన సూర్యాపేటలో జరగబోవు 136వజాతీయ శతాధిక కవి సమ్మేళనం బ్రోచర్లను ఆవిష్కరించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కె.శశికిరణ్ ఆవిష్కరణ
అమలాపురం ప్రతినిధి జూన్ 24 యువతరం న్యూస్:
ఐ. ఎస్ .ఓగుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ శ్రీ శ్రీకళా వేదిక అధ్యక్షులు డాక్టర్ కత్తి మండ ప్రతాప్ నిర్వహణలో తెలంగాణకు చెందిన సూర్యారావుపేటలో జూన్ 30వ తేదీ ఆదివారం జరుగనున్న 136వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం కవితోత్సవం కార్యక్రమం సంబంధించిన బ్రోచరును అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణంలోని అశ్విన్ పిల్లల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కే. శశి కిరణ్ , శశికళ వేదిక కోనసీమ జిల్లా కన్వీనర్ డాక్టర్ బివివి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ నల్లా నరసింహమూర్తి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు కత్తుల ఆనందరావు, వై. ఆర్ .కే .నాగేశ్వరావు కడలి రామలక్ష్మి, దొడ్డి సత్యవేణి,, బుర్రకథ కళాకారుడు శ్రీశ్రీ కళావేదిక జిల్లా కార్యవర్గ సభ్యుడు కడలిసత్యనారాయణ పాల్గొన్నారు.