ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం
కర్నూలు ప్రతినిధి జూన్ 22 యువతరం న్యూస్ :
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో స్థానిక లేబర్ కలలో ఉన్నటువంటి శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్మారక ఉన్నత పాఠశాల యందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి జిల్లా బాలల పరి రక్షణ అధికారి టి శారద గారు మాట్లాడుతూ ఈ యోగ వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయని ముఖ్యంగా శారీరక మానసిక ఆరోగ్యం కలవడమే కాక అనేక రోగాలు కూడా నయం కలగడానికి యోగ ఆసనాలనేటివి చాలా ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది మరియు ఈ కార్యక్రమంలో ఉద్దేశించి సోషల్ వర్కర్ నరసింహులు గారు మాట్లాడుతూ చిన్న వయసులో బాల్యవివాహాలు చేయడం వల్ల ముఖ్యంగా శారీరక మానసిక సమస్యలతో పాటు బాలికల యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అవుతుంది అని కావున కచ్చితంగా అమ్మాయిలకు 18 సంవత్సరాలు అబ్బాయిలకు 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే వివాహం చేయాలని ఒకవేళ చిన్న వయసు వివాహాలు చేస్తే బాలు నిషేధ చెట్టు ప్రకారం లక్ష రూపాయలు జరిమానా తో పాటు రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని తెలియజేయడం జరిగినది, మరియు బాలికలకు కల్పిస్తూ ముఖ్యంగా బాలికలు కొత్త కొత్త వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే అక్కడి నుంచి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లడం గాని మరియు ముఖ్యంగా తల్లిదండ్రులకు జరిగిన సంఘటన గురించి తెలియజేయాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్సిపిఓ శ్రీలక్ష్మి మరియు సోషల్ వర్కర్ గీతా తావాని ఔట్రిచ్ వెర్కర్స్ శ్వేత రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.