నిరుద్యోగ యువతీ యువకులకు మెగా జాబ్ మేళా
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అనసూయ సీతక్క

నిరుద్యోగ యువతీ యువకులు మెగా జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి .
జాబ్ మేళా లో 58 కంపెనీలు పాల్గొంటాయి
– రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు .
డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రకటన
ములుగు ప్రతినిధి జూన్ 15 యువతరం న్యూస్:
గ్రామీణ ప్రాంతాలలో ఉండే నిరుద్యోగ యువతీ యువకులు .ఈ నేల 19న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ములుగు మండలం లోని ఇంచేర్ల గ్రామములోని ఎంఆర్ గార్డెన్ లో 58 కంపెనీలు విప్రో, ముథ్ డ్ గ్రూప్స్,అపోలో ఫార్మసీ,
వరుణ్ మోటార్స్,నెక్సా మోటార్స్, ఆక్సస్ బ్యాంక్
వెట్రో సాఫ్టెక్ సొల్యూషన్ మేడ్ ప్లస్, ఎగ్జైట్ ఐ సొల్యూషన్,
సేవన్ టెక్ ఐటి సొల్యూషన్ చైతన్య విద్య సంస్థలు వంటి 58 కంపెనీలు మెగాజాబ్ మేళా లో పాల్గొంటాయి విద్యార్హతలు 7వ తరగతి నుండి డిగ్రీ తో పాటు వృత్తి విద్య కోర్సులు చేసిన వారికి వారి,వారి విద్య అర్హత ను బట్టి ఇంటర్వ్యూ నిర్వహించి వెంటనే ఉద్యోగాల్లో చేర్చుకోవడం జరుగుతుంది అని కావున ములుగు నియోజక వర్గం జిల్లా లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని యువతి యువకులు పిలుపునిచ్చిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క తెలిపారు.