శ్రీరామ భక్తులకు ఘన స్వాగతం పలికిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి

శ్రీరామ భక్తులకు ఘన స్వాగతం పలికిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి
(యువతరం ఫిబ్రవరి 14) జమ్మికుంట విలేఖరి:
కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని శ్రీరామ భక్తులు ఈనెల 8వ తేదీ రోజున ప్రత్యేక రైలులో అయ్యోధ వెళ్లి శ్రీరాముని దివ్య దర్శనం చేసుకొని తిరిగి వచ్చిన బీజేపీ జిల్లా ఉపాధయక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు,జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్,మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్,బీజేపీ నాయకులు,రామ భక్తులకు జమ్మికుంట రైల్వే స్టేషన్ లో మంగళ హారతులు,పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడు పుట్టిన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం 500 సంవత్సరాల హిందువుల కోరిక అని, గుడి నిర్మాణ పోరాటంలో అనేక మంది హిందువులు అసువులు భాషరని గుర్తుచేశారు. బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఒక ప్రధాన అంశమని, దానిని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాకచక్యంగా చొరవ తీసుకొని ఎలాంటి గొడవలకు తావులేకుండా కోట్లాది హిందువుల కలను సహకారం చేశారని కొనియాడారు. ప్రత్యేక రైలులో వెళ్లిన రామభక్తులు భక్తి శ్రద్ధలతో,సంతోషంగా రాముని దర్శనం చేసుకుని తిరిగి వచ్చారని, అలాగే జిల్లాలోని అనేకమంది హిందువులు, రామభక్తులు రాముడు పుట్టిన అయోధ్యలో రామ మందిర దర్శనాన్ని చేసుకొని రాముని (దేవుని) కృపకు పాత్రులు కాగలరని అన్నారు.