నీ చైర్మన్ పదవి మేము పెట్టిన భిక్ష

నీ చైర్మెన్ పదవి మేము పెట్టిన బిక్ష…
కౌన్సిలర్ పై దాడిని ముక్తకంఠంతో ఖoడించిన చైర్మన్ వ్యతిరేక వర్గం కౌన్సిలర్లు
(యువతరం ఫిబ్రవరి 14) జమ్మికుంట విలేఖరి:
నీ చైర్మన్ పదవి 29 మంది కౌన్సిలర్లు పెట్టిన బిక్ష అని 29వ వార్డు కౌన్సిలర్ రావికంటి రాజ్ కుమార్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని 29వ వార్డు కౌన్సిలర్ రావి కంటి రాజ్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం రాత్రి పది గంటల సమయంలో ఓ ప్రైవేట్ శుభకార్యానికి హాజరై బయటికి వస్తున్న తరుణంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మెన్ రాజేశ్వర్ రావు నన్ను బ్రోకర్ గా మారావని నా పట్ల అసభ్యకరంగా పరుష పదజాలంతో మాట్లాడి దాడి చేశారని అన్నారు.అవిశ్వాస కార్యక్రమ సమయంలో తమకు అనుకూలంగా సహకరించలేదని అక్కసుతో నాతో గొడవకు దిగాడన్నారు. కౌన్సిలర్ అని కూడా చూడకుండా దుర్భషలాడి దాడి చేశాడని అన్నారు .స్ధానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాధు చేసినట్లు తెలిపారు.ఛైర్మన్ గా కౌన్సిలర్ల స్వేచ్ఛను హరించావని అన్నారు.మా స్వంత నిర్ణయంతో నిన్ను ఇంత కాలం చైర్మెన్ గా సహకరించామని, ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తున్నామని ఆయన తెలిపారు.గౌరవాన్ని కాపాడుకోవాలని ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కౌన్సిలర్ పై దాడిని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు వ్యతిరేక వర్గం కౌన్సిలర్లు ముక్తకంఠంతో ఖండించారు.
మొన్నటిదాకా అవిశ్వాసం,భారాసా కౌన్సిలర్ల రాజీనామాలతో ఆసక్తికరంగా మారిన రాజకీయం తాజాగా మున్సిపల్ చైర్మెన్ గా ఉన్న వ్యక్తి కౌన్సిలర్ పై దాడి చేసి దుర్భాషలాడాడని కౌన్సిలర్లు ఆరోపించడంతో ఈ విషయం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
*కౌన్సిలర్ పై దాడి హేయమైన చర్య…
తోటి కౌన్సిలర్ పై దుర్భాషలాడి దాడి చేయడం హేయమైన చర్య కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య అన్నారు.కౌన్సిలర్ పోనగంటి మల్లయ్య మాట్లాడుతూ..
ఓ ప్రయివేట్ ఫంక్షన్ కు హాజరై బయటికి వస్తున్న తరుణంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు కౌన్సిలర్ రాజ్ కుమార్ పట్ల జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.బాధ్యతగల పదవిలో ఉన్నప్పుడు గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇలాంటి దిగజారుడు పనులు చేయడం సరికాదన్నారు.4 సంవత్సరాలు చేసిన అవినీతి బయటికి వస్తుందని భయపడి ఇలా గొడవకు దిగుతున్నారని అన్నారు. ఛైర్మన్ గా బిఅర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిబ్బందికి,కౌన్సిలర్లకు సరైన గౌరవం ఇవ్వలేదన్నారు.
చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి తప్ప,మెజారిటీ సభ్యులు అవిశ్వాసం పెడితే వారిని దూషించడం పద్ధతి కాదన్నారు.డబ్బులు ఇచ్చానని కౌన్సిలర్ పై ఆరోపణ చేయడం కాదు నిరూపణ చేయాలన్నారు.ఇది కేసిఆర్ ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు.సర్వే నంబర్ 629 ప్రభుత్వ భూమిలో 59 జీవో కింద ఛైర్మెన్ తన బినామిలకు భూములను కట్టబెట్టారని పేర్కొన్నారు. మున్సిపల్ లో,పట్టణంలో జరిగిన అవినీతి పై చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు పాపయ్య, మున్సిపల్ చైర్మన్ వ్యతిరేక వర్గం కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.